అద్దంకిలో బైక్ ప్రమాదం.. యువకుడికి గాయాలు

అద్దంకి పట్టణ పరిధిలోని మేదరమెట్ల రోడ్డులో శనివారం నల్లవాగు సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనదారుడికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్