ఆస్తి పన్నుపై వడ్డీకి 50 శాతం భారీ రాయితీ కమిషనర్ రవీంద్ర

అద్దంకి పట్టణంలోని ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం 50 శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డి. రవీంద్ర తెలిపారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంటి పన్ను వసూళ్లలో అద్దంకి మున్సిపాలిటీ జిల్లాలో మొదటి స్థానంలో, రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయడం దీనికి కారణమని, పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్