సంతమాగులూరు రైతులకు నూతన ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు సాగునీటి అవసరాల నిమిత్తం 25 నూతన ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చొరవతో 102 వ్యవసాయ బోర్లకు ఈ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరైనట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కొమ్మాలపాడు వద్ద రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు అందజేయగా, వారు వాటిని తమ వాహనాల్లో పొలాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్