రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో మత్స్యకారులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను కలిశారు. అర్హులైన పలువురికి మత్స్యకార భరోసా పథకం అందడం లేదని వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారి వివరాలను "డిజిటల్ బుక్"లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం.