తల్లికి చెల్లికి తేడా తెలియని జర్నలిస్ట్ ఏబీఎన్ రాధాకృష్ణ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాపట్ల జిల్లా వైసిపి ఆధ్వర్యంలో ఏబీఎన్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అద్దంకి వైసిపి ఇంచార్జి డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, అమరావతి పేరుతో జరిగిన అవినీతిని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మహిళలను అగౌరవపరిచేలా ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వైసిపి నాయకులు ఏబీఎన్ రాధాకృష్ణ, తెదేపా నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్