కొరిసపాడు: డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణం

కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాళీ అట్టపెట్టల బాక్స్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తు లోకి జారుకోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చాంద్ భాషా కు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. డ్రైవర్ నిద్ర వస్తే ప్రమాదానికి కారణమని ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.

సంబంధిత పోస్ట్