కొరిశపాడు మండలం పి. గుడిపాడు గ్రామంలో రూ. 1. 06 కోట్లతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో పాత స్తంభాలను తొలగించి 355 కొత్త విద్యుత్ స్తంభాలు, నూతన లైన్లు ఏర్పాటు చేశారు. నిరంతర త్రీఫేస్ సరఫరా కోసం రెండు ట్రాన్స్‌ఫార్మర్లు బిగించారు. ఈ పనులను శుక్రవారం ఎస్. సి. కాలనీలో ఈఈ నల్లూరి మస్తాన్ రావు గ్రామ టీడీపీ నేతలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొట్టే రవీంద్ర, మందా నాగేశ్వరావు, డీఈఈ ఎం. దామోదరం, ఏఈ ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.