కొరిసపాడు మండలం తమ్మవరం గ్రామంలో పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పొగాకు కొనుగోలు ప్రక్రియ జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.