కొరిశపాడు: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్

కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలో అద్దంకి రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా 'రన్ ఫర్ యూనిటీ' పేరుతో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లికార్జునరావు, ఎస్సైలు మహమ్మద్ రఫీ, సురేష్ లు విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఐక్యతకు దిక్సూచి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్