కొరిశపాడు మండలం మేదరమెట్లలో సింథటిక్ ఫ్యాక్టరీ నందు విపరీతమైన కారం కోరు వస్తుందని గ్రామస్తులు బుధవారం ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ ఎదుట టెంట్ వేసి నిరసనకు దిగారు. గతంలో అనేక హామీలు ఇచ్చి లిఖితపూర్వకంగా గడువు కోరారని గడువు తీరి నెలరోజులు గడుస్తున్న కోరు వస్తుందని వారు వాపోయారు. సమస్యను పరిష్కరించేంతవరకు ఆందోళన చేస్తామని టెంట్ తీయమని స్థానిక ప్రజలు తెలిపారు.