కొరిశపాడు: రేపు కరెంటు సరఫరా నిలిపివేత

కొరిశపాడు మండలం మేదరమెట్ల, సోమవరప్పాడు గ్రామాలలో రేపు విద్యుత్ సబ్ స్టేషన్ నందు మరమ్మత్తులు కారణంగా కరెంటు సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంటు సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులందరూ సహకరించాలని కోరారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ ను అందించడమే లక్ష్యమని చెప్పారు.

సంబంధిత పోస్ట్