కొరిశపాడు మండలంలోని అన్న రైతు సేవా కేంద్రాలలో అన్నదాత సుఖీభవ కు సంబంధించి లబ్ధిదారుల జాబితాను ఉంచినట్లు ఏవో రామ్మోహన్ రెడ్డి గురువారం తెలియజేశారు. రైతులు తమ పేర్లను సరిచూసుకోవాలని ఆయన సూచించారు. అన్నదాత సుఖీభవ సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. అలాగే రైతు సేవ సిబ్బంది ఏర్పాటుచేసిన జాబితా గురించి గ్రామస్తులకు వివరించాలని తెలిపారు.