కొరిశపాడు మండలం మేదరమెట్ల లోని ధర్మవరం రోడ్డు నందు శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న కారు ఒక సరిగా స్లో కావడంతో వెనుక నుంచి వస్తున్న ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం పాక్షికంగా దెబ్బతింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అయితే కారు అతను తాగి ఉన్నాడని స్థానికులు ఆరోపించారు.