కొరిశపాడు మండలం బొల్లవరప్పాడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు కాలనీవాసులు సోమవారం మండల కార్యాలయం వద్ద వాపోయారు. సుమారు మూడు నెలల నుంచి నీరు రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రోడ్లు సైడు కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.