కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామంలో మంగళవారం ఎస్ డబ్ల్యూ సి గూడెం నందు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఏవో రామ్మోహన్ రావు సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొంటారని ఆయన చెప్పారు. కావున నల్లబర్లి పొగాకు సాగుచేసిన రైతులందరూ హాజరు కావలసిందిగా కోరారు.