కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మహమ్మద్ రఫీ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు కొరిశపాడు గ్రామానికి పాలేటి రాకేష్ గా గుర్తించారు. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణమని ఎస్ఐ చెప్పారు.