పంగులూరు మండలం ముప్పవరం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ 108 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు ఎల్వోసీ పత్రాలు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఉపశమనాన్ని కలిగిస్తుందని, పేదల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.