కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో శనివారం ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సచివాలయ అధికారులు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదును అందజేశారు. పెన్షన్ దారులు సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని, ప్రతి ఇంటికీ వెళ్లి నేరుగా పెన్షన్లు అందిస్తున్నామని సచివాలయ అధికారి పోతురాజు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు సౌకర్యవంతంగా పెన్షన్లు అందుతున్నాయి.