సంతమాగులూరు మండలం, కొమ్మాలపాడు గ్రామంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తెలప్రోలు రమేష్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజా ప్రభుత్వమని నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.