సంతమాగులూరు మండలం పాత మాగులూరు వద్ద ఆదివారం రాత్రి గ్రామస్తులు రోడ్డు ఎక్కి ఆందోళనకు దిగారు. వినుకొండ నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న కారు గేదెను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గేదే అక్కడికక్కడే మృతి చెందింది. అయితే తగిన పరిహారం చెల్లించాలంటూ గేదె యజమానితో పాటు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారి సర్జి చెప్పారు.