అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపులో దేవస్థానానికి రూ. 26,93,686 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు తెలిపారు. నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ. 17,195 విరాళాలు కూడా అందినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ చుండూరి మురళి సుధాకర్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.