రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి UPDATE

అద్దంకి మండలం చక్రాయపాలెం సమీపంలో నామ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు తండ్రీకొడుకులు దమ్ము చినబాబు (30), సుశాంత్ (14) లు అక్కడికక్కడే మృతి చెందారు. శాంతినగర్‌లో బ్రహ్మం గారి ఆరాధనకు బైక్‌పై వెళ్తుండగా, ఆగి ఉన్న లారీని ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు మృతుని సోదరుడు చిరంజీవి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
.

సంబంధిత పోస్ట్