అమరావతి: 'జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ అవసరం'

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. జనాభా నియంత్రణ కాకుండా నిర్వహణ అవసరమని అన్నారు. “ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేరనే చట్టాన్ని నేను తీసుకొచ్చాను. మన రాష్ట్రంలో ప్రత్యుత్పత్తి రేటు 1.8గా ఉంది. దీనికి మెరుగుదల అవసరం" అని చెప్పారు.

సంబంధిత పోస్ట్