చంద్రబాబుపై వ్యాఖ్యలు: అంబటి రాంబాబుపై బహిష్కరణ వేటుకు డిమాండ్

పిట్లవానిపాలెం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి డాక్టర్ గ్లోరి యానెట్, సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును రాజకీయాల నుండి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదివారం డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అమలు చేస్తున్న సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచితంగా మాట్లాడటాన్ని ఆమె ఖండించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నామని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్