అమృతలూరు: పట్టపగలే భారీ బంగారం చోరీ

పట్టపగలే అమృతలూరులో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన రాపర్ల మల్లికార్జునరావు భార్యతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాపట్ల వెళ్లారు. ఇంటికి తాళం వేయడం గమనించిన దొంగలు, వెనుకతలుపు గడియ తీసి లోపలికి ప్రవేశించి బీరువా నుండి 180గ్రా. బంగారం అపహరించారు. సాయంత్రం ఇంటికి వచ్చిన వారికి వెనుక తలుపు చెక్క విరిగిపడినట్లు కనిపించింది. మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రవితేజ కేసు నమోదు చేసి, సీఐ శ్రీనివాసరావు స్థలాన్ని పరిశీలించారు. అపహరించబడిన బంగారం విలువ సుమారు రూ.18 లక్షలు.

సంబంధిత పోస్ట్