బాపట్ల మండలం, మరుప్రోలువారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని బుధవారం బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన చిన్నారులతో కలిసి ఆటలాడుతూ, వారిని ఉత్సాహపరిచారు. అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి సిబ్బంది కృషి చేయాలని సూచించారు.