చంద్రబాబు హామీలు నెరవేర్చడంలో విఫలం.. కోన రఘుపతి

మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బుధవారం బాపట్ల వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో విఫలమయ్యారని ఆరోపించారు. గత రెండేళ్ల పాలనలో చంద్రబాబు అప్పులు తప్ప ఇంకేమీ చేయలేదని విమర్శించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 4న మండల కేంద్రాలలో "వెన్నుపోటు"పై ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 12న బాపట్ల పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన జరుగుతుందని, దీనిని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్