బాపట్ల పట్టణంలోని ఆదర్శనగర్ లో గురువారం బాబు సెక్యూరిటీ మోసం గ్యారంటీ రచ్చబండ కార్యక్రమం జరిగింది. మాజీ ఉపసభాపతి పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. మ్యానిఫెస్టోలో హామీలు నెరవేర్చలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు వైఎస్ఆర్సిపి పై బురదజల్లే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాబు మోసాలను ప్రతి ఒక్కరు గమనించి రాబోయే రోజుల్లో వైయస్సార్సీపి మద్దతు తెరపాలని కోరారు.