బాపట్ల: రైల్వే మంత్రిని కలిసిన బాపట్ల ఎంపీ తెన్నేటి

న్యూ ఢిల్లీలో శుక్రవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నీ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సికిందరాబాద్ నుండి తిరుపతి, విజయవాడ నుండి బెంగళూరు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బాపట్ల, చీరాలలో నిలుపుదల చేయాలని వినతిపత్రం ఇచ్చారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు బాపట్ల ఎంపీ కార్యాలయం మీడియాకు తెలిపింది.

సంబంధిత పోస్ట్