బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం గ్రామంలో గురువారం ప్రాధమిక సహకార సొసైటీ చైర్మన్ గా చెన్నుపాటి కిషోర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొని మాట్లాడుతూ సహకార సొసైటీల ద్వారా రైతులకు అధిక రుణాలు ఇచ్చి చేయూతనందించాలని సూచించారు. బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, సహకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.