బాపట్ల: 84 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

శుక్రవారం, వేగేశన నరేంద్ర వర్మ తన కార్యాలయంలో 84 మంది లబ్ధిదారులకు రూ. 46,06,179 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆయన, సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే వేగేశన తక్షణమే సీఎం సహాయ నిధిని మంజూరు చేసినందుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్