బాపట్ల: నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరా ఉపయోగకరం డి. ఎస్. పి

బాపట్ల డిఎస్పి గోగినేని రామాంజనేయులు మాట్లాడుతూ, నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సతీష్ ఫుడ్ పార్క్ అధినేత, మాజీ శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ సహకారంతో ఫుడ్ పార్క్ ప్రతినిధి నరేంద్ర శనివారం డ్రోన్ కెమెరాను అందజేశారు. ఈ కెమెరాను సర్కిల్ పరిధిలో జరుగుతున్న వివిధ అసాంఘిక కార్యక్రమాలను గుర్తించడానికి ఉపయోగిస్తామని డిఎస్పి రామాంజనేయులు తెలిపారు. దాత నరేంద్రను ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్