బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేసేందుకు బాపట్ల జిల్లా యంత్రాంగం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి నిరాశకు లోనవవద్దని ప్రభుత్వం రైతు పక్షంలో నిలిచి ప్రతి రైతు పండించిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.