బాపట్ల: హోంగార్డుకు రూ. 15 లక్షలు భీమా చెక్కు అందజేత

2003వ సం. లో హోంగార్డ్‌గా నియమితులైన తెళ్ల శివ కుమార్ 2024 అక్టోబర్ 4వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే టర్న్ డ్యూటీ ముగించుకుని బాపట్లకు తిరిగివస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కుడి కాలు మోకాలుకు కింద భాగం తీవ్రంగా దెబ్బతిని పూర్తిగా విరిగిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఉన్నత అధికారులకు తెలియజేసి గురువారం ఎస్పీ కార్యాలయంలో రూ. 15 లక్షలు అందించారు.

సంబంధిత పోస్ట్