బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గురువారం ఢిల్లీలోని కేంద్ర రోడ్డు రవాణా , హైవే శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఏపీ రాజధాని అమరావతి నుండి బాపట్ల పార్లమెంటు ప్రధాన కేంద్రం బాపట్ల పట్టణం వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని NH216 4లైన్ గుంటూరు_నిజాంపట్నం పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగవంతం అయ్యేలాగా చూడాలని వినతిపత్రం సమర్పించారు.