బాపట్లలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆదివారం నుండి సమ్మెబాట పట్టారు. పురపాలక సంఘంలో విద్యుత్తు, త్రాగునీరు ఇతర ఇంజనీరింగ్ విభాగంలో సేవలు నిలిచిపోయాయి. కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమ్మె శిబిరంలో బైఠాయించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విధుల్లోకి హాజరయ్యేది లేదని పేర్కొన్నారు.