బాపట్ల: రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

రోడ్డు ప్రమాదాల నివారణలో ఎన్.జి.ఓలు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె. పరంధామ రెడ్డి సూచించారు. రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా బాపట్ల రవాణా శాఖ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, 2004లో రాష్ట్రంలో 8,346 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, 19,894 మంది గాయపడ్డారని తెలిపారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్