న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సోమవారం ఓడి ఓపి అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల సిల్క్ చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపునకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ నుంచి ఉత్పత్తి అవార్డు ను కలెక్టర్ అందుకున్నారు. ఓడి ఓపి అవార్డుతో జాతీయ స్థాయిలో చీరాల కుప్పడం చీరలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.