బాపట్ల పట్టణంలోని సరస్వతి మెమోరియల్ బాలికల పాఠశాలలో గురువారం మెగా పేరెంట్ - టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు మెగా పేరెంట్స్ డే ఎంతో దోహదపడుతుందన్నారు. పేదరికం నుండి బయటకు తెచ్చే ఒకే ఒక్క ఆయుధం విద్య అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో మెగా పేరెంట్ టీచర్స్ డే కార్యక్రమం నిర్వహించటం సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు.