బాపట్ల: ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి

బాపట్ల మండలం అడవి పంచాయతీ సూర్యలంక బీచ్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తి లాకర్ రూమ్ ను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి బాపట్ల జిల్లా జై భీమ్రావు పార్టీ అధ్యక్షుడు పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ గతంలో అన్ని సౌకర్యాల తో ప్రభుత్వం లాకర్ రూమ్ ఏర్పాటు చేస్తే గత లీజు దారుడు మొత్తం తీసుకెళ్లడం పాటు రూమ్ ను ధ్వంసం చేశాడని ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్