బాపట్ల: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలి

బాపట్ల సూర్యలంక పర్యాటక కేంద్రానికి వచ్చే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వివిధ మాధ్యమాలలో పోస్టులు పెట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాపట్ల జిల్లా జై భీమ్రావు పార్టీ అధ్యక్షుడు పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. బుధవారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పర్యాటక కేంద్రం దినదినాభివృద్ధి చెందుతుంటే కొందరు ఓర్వలేక అసత్య ప్రచారాల చేసి పర్యాటకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్