బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ బుధవారం బాపట్ల లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏప్రిల్ ఒకటిని బ్లాక్ డే గా అభివర్ణించిన సీఐటీయూ నాయకులు, కార్మికులను వేతన బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్స్ ను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల పాలిట చీకటి రోజు అని పేర్కొన్నారు.