అక్రమ ఇసుక తవ్వకాలపై బీఎస్పీ నేత ఆగ్రహం

బాపట్ల నియోజకవర్గ పరిధిలోని తూర్పు పిన్నిబోయినవారిపాలెం గ్రామ సమీపంలో నల్లమడ డ్రైన్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై బాపట్ల నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి డా. గుదే రాజారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో భారీ ఎత్తున ఇసుకను తవ్వి తరలిస్తూ ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆయన బహిరంగంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్