ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబరు బత్తుల పద్మావతి బుధవారం బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాముఖితో సంభాషించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని లిఖితపూర్వకంగా వ్రాయించినారు. అనంతరం స్టాక్ రిజిస్టర్స్ ను విద్యార్థుల, ఉపాధ్యాయుల అటెండెన్స్ వెరిఫికేషన్ చేసి డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.