27 మంది కి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. మంగళవారం బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 27 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ. 15.69 లక్షల చెక్కులను అందజేశారు. ప్రతి లబ్ధిదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్