చిన్నారి వైద్యానికి రూ.3.07 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం మంజూరు

పర్చూరు శాసనసభ్యులు సాంబశివరావు చొరవతో, ఇడుపులపాడు గ్రామానికి చెందిన ముత్తుకూరి పెద్ద ఇశ్రాయేలు కుటుంబంలోని చిన్నారికి అత్యవసర వైద్యం కోసం రూ.3.07 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం మంజూరైంది. చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అధిక మొత్తంలో వైద్య ఖర్చులు అవసరమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సాంబశివరావు, చిన్నారి వైద్యానికి ఎల్ఓసీ చెక్కును మంజూరు చేయించారు. శనివారం స్థానిక నాయకులు లబ్ధిదారునికి ఈ చెక్కును అందజేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్