మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు

బాపట్ల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు పది, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ అభినందించారు. బుధవారం విద్యార్థులను ప్రశంసా పత్రాలు, పతకాలతో సత్కరించి ప్రోత్సహించారు.
ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ మంచి మార్కులు సాధించడం అభినందనీయమని పేర్కొన్న ఆయన, విద్యార్థులు తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు. కొత్తగా చేరే విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్