సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, శనివారం బాపట్ల పట్టణంలోని వ్యవసాయ ఇంజనీరింగ్ సాంకేతిక విద్య కళాశాల వద్ద కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు, యూనియన్ నాయకులు ఓ. లక్ష్మణ, నిరంజన్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ నాయకులు కె. శరత్ మాట్లాడుతూ, భారతదేశ కార్మిక వర్గ పోరాట చరిత్రలో మే 30 ఒక మైలురాయి అని, శ్రామిక జనం హక్కుల రక్షణ కోసం, దోపిడీ రహిత సమాజ స్థాపన కోసం ఎర్ర జెండా ఎత్తిన మహోన్నత శక్తి సిఐటియు అని అన్నారు. కార్మిక సంఘాలు ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు.