తుఫాను తాకిడి: ఉద్యాన పంటల నష్టంపై అధికారి పరిశీలన

బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్న తాళి గ్రామంలో మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలను ఉద్యానవన శాఖ అధికారి హనుమంతు నాయక్ పరిశీలించారు. బొప్పాయి, అరటి, మిరప, కూరగాయల పంటలలో నీరు నిలిచిపోవడం వల్ల నష్టాన్ని తగ్గించడానికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. తోటల్లో ఎక్కడైనా నీరు నిలిచి ఉంటే, 48 గంటలలోపు దానిని బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్