బాపట్ల, బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆర్ జే ఎస్ టి కాలనీలోని భవిత కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మార్టూరు ఎంఈఓ వస్త్రం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అత్యంత పట్టుదలతో జీవితాన్ని గెలిచే యోధులు దివ్యాంగులేనని తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఉపాధ్యాయురాలు చిగురుపాటి నాగ కుమారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.